వంటపేరు : మైసూర్ పాకం
కావలసిన పదార్ధాలు :
శెనగపిండి : పావు కేజీ
పంచదార : పావు కేజీ
నెయ్యి : 100 గ్రాములు
తయారుచేయు విధానం :
శెనగపిండి జల్లించాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండిపెట్టి కొద్దిగా నెయ్యి వేసి శెనగపిండిని దోరగా వేపాలి, దీనిని పక్కనపెట్టి, మందపాటి గిన్నెలో పంచదార వేసి కొద్దిగా నీళ్ళుపోసి స్టవ్ మీద పెట్టాలి పంచదార కరిగి తీగ పాకం వచ్చాక, నేతిలో వేపిన శెనగపిండిని పాకంలో వేసి ఉండలు కట్టకుండా కలపాలి. కాస్త గట్టిపడ్డాక నెయ్యి పోస్తూ కలపాలి పాకం వచ్చి పువ్వులా వస్తుంది ఇప్పుడు ప్లేటికి నెయ్యి రాసి పాకంని ప్లేటులోనికి వంచి సమంగా చేసి చల్లారిన తరువాత ముక్కలుగా కోయ్యటమే.అంతే నోరూరించే మైసూర్ పాకం రెడి.

300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te