గోంగూర నిల్వ పచ్చడి (Gongoora nilva pachchadi)

కావలసిన పదార్ధాలు :

పుల్ల గోంగూర : అరకేజీ
ఎండుమిర్చి : 200  గ్రాములు 
జీలకర్ర : రెండు టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు : 50  గ్రాములు 
నూనె : పావుకేజీ
ఉప్పు : సరిపడ
చింతపండు : నిమ్మకాయంత
పోపుదినుసులు : కొంచెం
కరివేపాకు : కొద్దిగా


తయారుచేయు విధానం :

1) ముందు రోజు రాత్రి గోంగూర కోసి, కడిగి నీళ్ళుపిండి ఆరబెట్టాలి. 
    తెల్లవారేసరికి నీళ్ళు మొత్తం ఆరిపోయి గోంగూర పొడిపొడిగా వుంటుంది.
2) ఇప్పుడు స్టవ్ మీద కళాయిపెట్టి నూనె వేడి చెయ్యాలి. నూనె కాగాక 
    ఎండుమిర్చి వేసి వేపాలి.
3) అవి వేగాక, తీసి అదే నూనెలో జీలకర్ర, గోంగూర వేసి వేపాలి. గోంగూర, 
    నూనెలో వేగి ముద్దలా వస్తుంది.
4) ఇప్పుడు మిక్సిలో ఎండుమిర్చి, ఉప్పు వేసి ఒకసారి తిప్పి, తర్వాత వెల్లుల్లి 
     వేసి కొంచెం మెత్తగా రుబ్బాలి.
5) ఇప్పుడు గోంగూర, చింతపండు తిప్పి మెత్తగా నలిగిన తరువాత తీసి 
     పక్కన పెట్టాలి.
6) స్టవ్ మీద కళాయి పెట్టి నూనెవేసి పోపుదినుసులు వేపాలి. వేగిన పోపు
    దినుసులను గోంగూర మిశ్రమంలో కలపాలి.


* అంతే గోంగూర నిల్వ పచ్చడి రెడీ.