గోధుమ హల్వ (Preparation of Wheat Halwa / Godhuma Halwa)

కావలసిన పదార్ధాలు : 

గోధుమలు : పావుకేజీ 
పంచదార  : పావుకేజీ
నెయ్యి : పావుకప్పు  
జీడిపప్పులు : 50 గ్రాములు. 
కిస్మిస్లు : కొద్దిగా
యాలుకలపొడి : కొద్దిగా
రంగు : కొద్దిగా

తయారు చేయు విధానం :

గోధుమలను ముందు రోజురాత్రి నానపెట్టాలి. నానిన గోధుమలను రోతిలోవేసి రుబ్బాలి, అలాచేసి, గోధుమ పాలను తీసుకోవాలి, గిన్నెలో పోసి కాసేపు అగిన తరువాత, పైన తెరుకున్న నీటిని వంచి మిగిలిన పాలలో పంచదారను కలిపి సనన్ని మంటమీద పెట్టి కలుపుతూ వుండాలి. కాసేపటికి గట్టి పడుతుంది. అలా గట్టిపడ్డాకనే నెయ్యి పోసికలపాలి. అలా కలుపుతూనే కట్టిపడ్డాక ..జీడిపప్పులు, కిస్మిస్లు, యాలకుల పొడి వేసి కలపాలి. ఇప్పుడు పళ్ళానికి నెయ్యి రాసి, గట్టిపడిన గోదుమ హల్వాను ప్లేటులో సమంగా పరచి చల్లారిన  తరువాత ముక్కలుగా కొయ్యాలి. అంతే గోధుమ హల్వా రెడి.