జీడిపప్పుపాకం (Cashew Brittle / Jeedipappu Pakam)

కావలసిన పదార్ధాలు :

జీడిపప్పులు : 1 కేజీ 
బెల్లం : 1 కేజీ
నెయ్యి : 50 గ్రాములు

తయారు చేయు విధానం :

ముందుగా బెల్లంకోరి మందపాటి గిన్నెలో వేసి, స్టవ్ మిద పాకం పట్టాలి. ముదురు పాకం వచ్చాక దానిలో నెయ్యి పోసి కలపాలి.  ఇప్పుడు జీడిపప్పులు వేసి బాగా కలపాలి. ఒక పళ్ళానికి నెయ్యి రాసి అందులో పాకం పోసి పలుచగా చేసి ఆరనివ్వాలి, ఆరిన తరువాత మనకు కావలసిన ఆకారంలో ముక్కలుగా కోసుకోవాలి. అంతే జీడిపప్పు పాకం రెడి. ఇది పది రోజులు వరకు నిల్వ ఉంటుంది.