బొబ్బట్లు (How to make Bobbatlu)

కావలసిన పదార్ధాలు : 

మైదా : పావు కిలో 
పచ్చి సెనగపప్పు : పావు కిలో 
బె ల్లం : పావు కిలో
యాలుకుల పొడి : కొద్దిగా
నెయ్యి : బొబ్బట్టులు కాలటానికి సరిపడనంత


తయారు చేయు విధానం : 

మైదాని నీరుపోసి కలపి ముద్దగా చేసి గంట నాననివ్వాలి.  పచ్సి శెనగపప్పును కుక్కర్లో ఉడికించి దానిలో నీరు వుంటే  వంచి, బెల్లం  కోరి పప్పులోవేసి బాగాకలపాలి. పప్పు బెల్లం కలిసాక గట్టిపడి ముద్దలా వచ్చాక చిన్నచిన్న ఉండలుగా చేసికోవాలి. ఇప్పుడు మైదాని తీసుకొని చిన్నచిన్న ఉండలుగా తీసుకోని చేతితో పలుచగాచేసి, శెనగపప్పు ముద్దని మద్యలోపెట్టి మళ్లీ ఉండలుగా చేసి కాస్త మందంగా చపాతిలా చేసి, అట్లరేకుపై నెయ్యి వేసి కాల్చాలి.