వంటపేరు : బంగాళదుంపలు, మెంతికూర వేపుడుకావలసిన పదార్ధాలు :
బంగాళదుంపలు : అర కేజీ
మెంతికూర : చిన్నవి రెండు కట్టలు
నూనె : 100 గ్రాములు
పోపు దినుసులు : రెండు స్పూన్లు
కరివేపాకు : రెండు రెమ్మలు
ఎండుమిర్చి: రెండు
కారం : ఒక పెద్ద స్పూన్
ఉప్పు : తగినంత
తయారుచేయు విధానం :
బంగాళ దుంపలు చెక్కు తీసి ముక్కలుగా కోసి పక్కనపెట్టాలి, మెంతు ఆకులు కోసి నీటిలో కడిగి నీరు లేకుండా పిండి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండిపెట్టి నూనె వేడి చెయ్యాలి, వేడి కాగానే పోపు దినుసులు వేసి కాస్త వేగాక ఎండిమిర్చి వేసి వేగాక, వెల్లులి వేసి వేగాక, బంగాళ దుంపలు వేసి మూత వేసి సన్న మంట మీద కాస్త వేగాక, మూత తీసి ఒకసారి కలిపి, కారం ఉప్పు వేసి కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు కరివేపాకు వేసి ఒకసారి కలిపి మెంతికూర నీరు పిండి బంగాళా దుంపల్లో వేసి కలపాలి. రెండు నిముషాలు కలిపి వేగిన తరువాత మూతపెట్టి స్టవ్ ఆపాలి, అంతే బంగాళా దుంపల - మెంతికూర వేపుడు రెడి.
300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te