చేప ముక్కలు : 1 కేజీ
చింత పండు : 100 గ్రాములు
కారం : మూడు పెద్ద స్పూన్ లు
ఉప్పు : సరిపడినంత
ఉల్లిపాయలు : పెద్దవి మూడు
పచ్చిమిర్చి : ఆరు
అల్లం వెల్లుల్లి ముద్ద : ఒక పెద్ద స్పూన్
అల్లం వెల్లుల్లి ముద్ద : ఒక పెద్ద స్పూన్
కొత్తిమిర : 1 కట్ట
కరివేపాకు : నాలుగు రెమ్మలు
కరివేపాకు : నాలుగు రెమ్మలు
గరం మసాల పొడి : ఒక స్పూన్
నూనె : 150 గ్రాములు
నూనె : 150 గ్రాములు
పసుపు : 1 చిన్నస్పూన్
తయారుచేయు విధానం :
చేపముక్కలు బాగా కడిగి వాటికి పసుపు, కారం, ఉప్పు, అల్లం-వెల్లుల్లి ముద్దా వేసి బాగాకలపాలి. వీటిని పావుగంట పక్కనపెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండిలో నూనె వేసి కాగాక ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. అవి వేగగానే అన్నికలిపిన చేపముక్కలు వేసి ఒకసారి కలిపి మూతపెట్టాలి. ఒక నిముషం ఆగి మూత తీసి దానిలో చింతపండు రసం పొయ్యాలి. మూతపెట్టి పది నిముషాలు వుడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసిచుస్తే కూరలో నూనె పైకితేలుతుంది. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమిర, గరంమసాల జల్లి మూతపెట్టి స్టవ్ ఆపాలి. అంతే గుమగుమలాడే చేపల కూర రెడి. ఇది వేడిగా ఉన్నప్పటి కంటే చల్లారిన తరువాత తింటే చాలా రుచిగా వుంటుంది.
