టమాట స్వీట్ (Tomato Sweet in Telugu)

టమాట స్వీట్ 
కావలసిన పదార్ధాలు :

టమాటాలు _పావుకిలో 
పంచదార _ పావుకిలో 
కార్న్ ప్లోర్ _ వంద గ్రాములు 

నెయ్యి _ వంద గ్రాములు 
యాలుకలుపొడి  _టీ స్పూన్ 

తయారుచేయు విధానం :

1) టమాటాలు శుబ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి మిక్సిలో  వేసి రసం తియ్యాలి.ఈ రసం ఒక గిన్నెలోకి వడకట్టాలి. 

2) ఇలా వడపోసిన  రసంలో కార్న్ ప్లోర్ వేసి ఉండలు లేకుండా కలపాలి.

3) ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పంచదార వేసి దానిలో కొద్దిగా నీళ్ళుపోసి  తీగ పాకం పట్టాలి.

జీడిపప్పులు వేనేతిలో వేయించుకోవాలి.

4) పాకం వచ్చాక కార్న్ ప్లోర్ కలిపిన టమాట రసం వేసి కలుపుతూ ఉడికించాలి.కాసేపటికి గట్టిపడుతుంది.

5) ఇప్పుడు నెయ్యి వేసి కలపాలి. నెయ్యి బాగా కలిసాక యాలుకలపొడి వేసి కలపాలి .ముద్దగా అయ్యి పాన్ కి అంటుకోకుండా ఉంటుంది.
అంటే టమాట స్వీట్ తయారయింది.

6) ఇప్పుడు ప్లేటుకి నెయ్యి రాసి దానిలోకి ఇలా తయారయ్యిన టమాట స్వీట్ వేసి పలుచగా సర్ది నేతిలో వేయించిన జీడిపప్పులు వేసి అలంకరించి 

7) చల్లారిన తరువాత మీకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అంతే  టమాట స్వీట్ (హల్వా)రెడి.