రోటి స్వీట్
గోధుమపిండి : కప్పు
జీడిపప్పులు, బాదాం కలిపి : అర కప్పు
పంచదార పొడి : కప్పు
నెయ్యి : అర కప్పు
తయారుచేయు విధానం
1) గోధుమపిండిని చపాతి పిండి ముద్దలా కలిపి రెండు గంటలు
నాననివ్వాలి.
2) తరువాత చిన్న చిన్న ఉండలుగా చేసి చపాతి లా చేసుకోవాలి.
3) తరువాత స్టవ్ ఫై పాన్ పెట్టి నూనె లేకుండా చపాతీలు కాల్చాలి.
4) వీటిని చిన్నచిన్న
ముక్కలుగా చేసి చల్లారిన తరువాత మిక్సిలో వేసి పొడి చెయ్యాలి.
5) జీడిపప్పు బాదాం లు నేతిలో వేయించి బరకగా మిక్సి పట్టాలి
6) నెయ్యి వేడి చేసి మిక్సి చేసిన చపాతి పొడిని వేయించి ఒక
ప్లేటులోకి తీసుకోవాలి.
7) ఇప్పుడు వేయించిన చపాతి పొడిలో కప్పు పంచదార వేసి కలిపి
వేయించి పొడి చేసిన జిడి పప్పుల పొడి వేసి కలిపి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
8) అలాగే తినవచ్చు లేదా ఉండలుగా చుట్టుకొని తినవచ్చు.
.
Post a Comment