కావలసిన పదార్దాలు:
ఉల్లిపాయలు : రెండు
మిరియాలు : పది
అల్లం : రెండు అంగుళాల ముక్క
వెల్లుల్లి : ఒకటి
అవంగాలు : మూడు
యాలుకలు : మూడు
ఉప్పు : తగినంత
పలావ్ ఆకు : రెండు దాల్చిన చెక్క : రెండు ముక్కలు
కారం : రెండు టీ స్పూన్లు
నూనె : అర కప్పు
పసుపు : కొద్దిగా
నెయ్యి : రెండు టేబుల్ స్పూన్లు
జీలకర్ర : టీ స్పూన్
కొత్తిమీర: కట్ట
గసగసాలు : పావుకప్పు
తయారుచేయు విధానం:
1) చికెన్ కడిగి చిన్నముక్కలుగా కట్చేసుకోవాలి.
2) మిరియాలు, జీలకర్ర, లవంగాలు, యాలుకలు, చెక్క కలిపి పొడి లా చేసుకోవాలి.
3) అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, గసగసాలు కలిపి ముద్దలా నూరుకోవాలి.
4) స్టవ్ ఫై కళాయి పెట్టి నూనె వేడి చేసి నూనె, నెయ్యి వేసి కాగాక దానిలో లవంగాలు, చెక్క, యాలుకలు, ఆకు వేసి వేయించాలి.
5) అవి వేగాక ఉల్లి ముక్కలు వేసి వేయించాలి. అవి వేగాక చికెన్ ముక్కలు వేసి తడి పోయే వరకు వేయించాలి. (సుమారు పావుగంట )
6) చికెన్ లో నీళ్ళు మొత్తం ఇగిరి పోయాక ఆరు గ్లాసులు నీళ్ళు పోసి ఉడికించాలి.
7) ఇప్పుడు ముద్దలా చేసిన అల్లం, గసగసాలు ముద్ద వెయ్యాలి.
8) మూడు గ్లాసులు నీళ్ళు వరకు మరిగిన తరువాత కొత్తిమీర, పొడిలా చేసిన మషాలా వేసి ఒక నిముషం ఉంచి స్టవ్ ఆపాలి.
9) ఇది జలుబు చేసి నప్పుడు ఈ షేర్వా వేడివేడిగా తింటే జలుబు తగ్గుతుంది.ఇది కారంగా ఉంటేనే బాగుంటుంది.
10) ఈ షేర్వా రకరకాల చికెన్
వంటల్లో ఉపయోగించుకోవచ్చు .
Post a Comment