చేపలు కట్ లెట్స్ (Fish Cutlet in Telugu)


కావలసిన పదార్దాలు:
చేప : అరకిలో
నూనె : రెండు కప్పులు
వేయించిన శెనగపప్పు : అర కప్పు
అల్లం : చిన్న ముక్క
వెల్లుల్లు రేకలు : ఐదు
లవంగాలు : నాలుగు
పచ్చిమిర్చి : నాలుగు
చెక్క : చిన్న ముక్క
లవంగాలు : మూడు
గసగసాలు : రెండు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర : కట్ట
ఉల్లి పాయ : ఒకటి
 కారం : టీ స్పూన్
ఉప్పు : తగినంత  
పసుపు : చిటికెడు

తయారుచేయు విధానం:
1) చేపను శుబ్రంగా కడిగి నీళ్ళు పోసి ఉడికించాలి.
2) చల్లారాక ఫై తోలు, ముళ్ళు తీసి  మిగిలిన చేప మాంసాన్ని నీరంతా పోయేలా గట్టిగా పిండి పక్కన పట్టాలి.
3) శనగపప్పును మిక్సిలో వేసి మెత్తని పొడి చెయ్యాలి.
4) ఇప్పుడు చెక్క, లవంగాలు, అల్లం, వెల్లుల్లి, గసగసాలు, ఉల్లిపాయ, ముద్దలా నూరుకోవాలి.
5) ఒక గిన్నెలో ఈ మషాలా ముద్దా, కారం, ఉప్పు, కొత్తిమీర, పసుపు, గట్టిగా పిండిన చేప వేసి ముద్దలా బాగా కలపాలి.
6) స్టవ్ ఫై కళాయి పెట్టి నూనే వేడి చెయ్యాలి. నూనె కాగాక ఈ ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసి
ఒక్కో ఉండను అరచేతిలోకి తీసుకోని చిన్నగా నొక్కి (వడలు మాదిరి)కాగే నూనెలో వేసి ఎర్రగా వేయించుకోవాలి.

ఏంతో  రుచిగా ఉండే చేప కట్లేట్ రెడి.