కాకరకాయ శెనగపిండి వేపుడు (Bitter Gourd Fry in Telugu )



కావలసిన పదార్దాలు :

కాకరకాయలు : అర కేజీ 
శెనగపిండి : వందగ్రాములు 
కారం : టీ స్పూన్ 
ఉప్పు : తగినంత 
నూనె : అర కప్పు
పసుపు : అర టీ స్పూన్ 

తయారుచేయు విధానం: 

1) ముందుగా కాకరకాయలు  నిలువుగా కట్ చేసి లోపలి గింజలు తీసేసి గుత్తు వంకాయ లా నాలుగు ప్రక్కలా కట్ చేయ్యాలి. 

2) వీటిలో కొద్దిగా ఉప్పు,పసుపు వేసి ఉడికించాలి.నీళ్ళులేకుండా వార్చాలి.

3) ఇప్పుడు శెనగ పిండిలో కారం, ఉప్పు, కొద్దిగా నూనె వేసి తడి పొడిగా కలపాలి.

4) నీళ్ళు వార్చిన కాకర కాయల్లో ఈ శెనగ పిండి నిండుగా కూరాలి.
(గుత్తు వంకాయల్లో మషాలా కూరినట్లు  )

5) స్టవ్ ఫై నూనె వేడి చేసి కాగాక వీటిని ఒక్కొక్కటిగా వేసి  విడిపోకుండా నెమ్మదిగా అట్లకాడతో కలుపుతూ (తిరగేయ్యాలి).

6) బాగా ఎర్రగా వేగాక దించుకోవాలి.ఈ కాకర కాయలు అసలు చేదే  ఉండదు.చాలా రుచిగా ఉంటుంది.