కాకరకాయల కారప్పొడి (Kakarakayalu Karappodi in Telugu )కావలసిన పదార్దాలు 

కాకరకాయలు _ పావుకేజీ 
ఎండుమిర్చి -వందగ్రాములు 
ధనియాలు -వందగ్రాములు 
జీలకర్ర-రెండు టీ స్పూన్లు
కరివేపాకు-ఒక కప్పు 
నూనె-వేయించడానికి సరిపడినంత
వెల్లుల్లి-ఒకటి 
ఉప్పు-తగినంత

తయారు చేయు విధానం

1) కాకర కాయలు కడిగి ,శుబ్రంగా తుడిచి సన్నగా గుండ్రంగా ముక్కలుగా కట్  చేయాలి.
2) స్టవ్ వెలిగించి కళాయ పెట్టి నూనెవేడి చేయాలి.
3) నూనె కాగిన తరువాత మిర్చి, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు విడివిడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
4) ఇప్పుడు కాకరకాయలు కరకరలాడేలా వేయించి పక్కనపెట్టాలి 
5) కాకరకాయలు తప్పించి మిగిలిన పదార్దాలు మిక్సి జార్లో వేసి పొడిలా చెయ్యాలి.
6) వేయించిన కాకరకాయలు ఈ కారప్పోడిలో కలిపి వేడివేడి అన్నంలో వడ్డించాలి.
ఎంతో రుచిగాఉండే కాకరకాయలు కారప్పొడి రెడి.