కూర కాయలు, దుంపకూర లతో కూర (vegetabul curry in telugu )



కావలసిన పదార్దాలు :

బంగాళ దుంపలు - రెండు 
క్యేరేట్ - రెండు 
కంద - పావుకిలో 
ముల్లంగి - ఒకటి 
బీన్స్ - అర కప్పు 
చుక్కుడు - వంద గ్రాములు 
పచ్చి బఠాని - అర కప్పు 
వంకాయలు - మూడు
గుమ్మడి - పావుకిలో 
ములక్కాడలు - రెండు 
అనబ ముక్క - పావుకిలో 
దొండకాయలు - వంద గ్రాములు  
ఉల్లి పాయలు - మూడు 
పచ్చిమిర్చి - పది 
ఉప్పు - తగినంత 
కారం - టీ స్పూన్ 
వెనిగర్ - మూడు టేబుల్ స్పూన్లు 
కొబ్బరి పాలు - రెండు కప్పులు 
పసుపు - అర టీ స్పూన్ 
అల్లం వల్లుల్లి పేస్టూ - టీ స్పూన్ 
పసుపు - అర టీ స్పూన్ 
నిమ్మరసం - రెండు టేబుల్ స్పూన్లు 
కరివేపాకు - కొద్దిగా 
కార - రెండు టీ స్పూన్లు 
నూనె - వంద గ్రాములు 
కొత్తిమీర - కట్ట 

తయారుచేయు విధానం :

1) ముందుగా కాయకూరలు  కడిగి ముక్కలుగా కట చెయ్యాలి. 
2) స్టవ్ ఫై గిన్నె పెట్టి నూనె వేడి చేసి కరివేపాకు ,పోపు దినుసులు వేసి వేగిన తరువాత ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ,అల్లం వల్లుల్లి పేస్టూ వేసి వేయించాలి.
3) ఇప్పుడు కాయ కార ముక్కలు ,దుంప ముక్కలు వేసి  పసుపు,ఉప్పు,కారం,ఒకకప్పు కొబ్బరి పాలు పోసి 
మూతపెట్టి పది నిముషాలు ఉడి కించాలి.
4) కాయకూర ముక్కలు ఉడికి నీరంతాయిగిరిపోయాక మిగిలిన కొబ్బరి పాలు పోసి ఐదు నిముషాలు ఉడికించి 
స్టవ్ ఆపాలి.
5) ఇప్పుడు నిమ్మరసం, వెనిగర్, కొత్తిమీర వేసి కలిపి సర్వ్ చెయ్యటమే.
ఈ సంక్రాంతి వేళ్ళ అతిధులకు , కుటుంబ సభ్యులకు వడ్డించండి.