చికెన్ వెజ్ కర్రి (Chicken Veg Curry in Telugu )



కావలసిన పధార్దాలు :
చికెన్   అర కేజీ
ముల్లంగి  రెండు
కేరెట్  రెండు
పాలకూర  ఒక కట్ట
టమాటాలు  రెండు
 పచ్చిమిర్చి  ఐదు
కీరదోస - ఒకటి (చిన్నది)
పచ్చి కొబ్బరి కోరు  పావు కప్పు
ఉప్పు- తగినంత
కారం  రెండు టీ స్పూన్లు
పసుపు - అర టీ స్పూన్
మసాల  టీ స్పూన్
అల్లం వెల్లుల్లి  రెండు టీ స్పూన్లు
కొత్తిమీర  కట్ట
నూనె  అర కప్పు

తయారుచేయు విధానం
1) చికెన్  కడిగి పక్కన పెట్టాలి.మిగిలి వన్ని ముక్కలుగా కట్ చెయ్యాలి.
2) స్టవ్ ఫై నూనె వేడిచేసి ఉల్లి, మిర్చి ముక్కలువేసి వేయించాలి.
3) అవి వేగాక చికెన్ వేసి వేయించాలి.ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, వేసి కలిపి కేరెట్, ముల్లంగి,కీర దోస ముక్కలు వేసి చిన్న మంట మీద మూడు నిముషాలు ఉడికించాలి.
4) ఇప్పుడు టమాటా ముక్కలు, పాలకూర వేసి  కాసేపు ఉడికించాలి.
5) ఇప్పుడు కొబ్బరి, మసాల, కొత్తిమీర,పుదీనా, జీరాపొడి  వేసి ఒక నిముషం ఉడికించి స్టవ్ ఆపాలి.