బాదం జెల్లి (Almond Jelly in Telugu )



కావలసిన పదార్దాలు 

బాదంపప్పులు  (నానబెట్టినవి ) - కప్పు 
పాలు - నాలుగు కప్పులు 
చైనాగ్రాస్ - కప్పు 
క్రీం - కప్పు 
షుగర్ - కప్పు 
బాదం ఎసెన్స్ - పావుటీ స్పూన్ 

సిరప్ కోసం 

షుగర్ - అర కప్పు 
నీళ్ళు - రెండు కప్పులు 

డెకరేట్ కోసం 

ఊరిన ఫైనాపిల్ ముక్కలు - ఆరు   
ఊరిన చెర్రిస్ - ఆరు 


తయారుచేయు విధానం 

చైనా గ్రాస్ ను నీళ్ళల్లో అరగంట నానబెట్టి చిన్న మంటమీద ఉడికించాలి. 
ఉడికిన తరువాత పాలు, షుగర్ వేసి ఉడికించాలి.షుగర్ కరిగిన తరువాత దించి చల్లార్చాలి.
చల్లారిన ఈ మిశ్రమానికి బాదం పప్పులు, క్రీం  కలిపి  అంగుళం మందంగా ఉన్న ప్లేటులో పోసి ఫ్రిజ్ లో పెట్టాలి.
కాసేపటికి గట్టి పడుతుంది.
ఇప్పుడు సిరప్ తాయారు చెయ్యాలి.
అర కప్పు షుగర్ లో రెండు కప్పులు నీళ్ళు పోసి కరిగించి దీనిని కూడా ఫ్రిజ్ పెట్టాలి.కాసేపటికి చల్లబడుతుంది.
చైనా గ్రాస్ ను కావలసిన ఆ కారంలో కట్ చేసుకొని సిరప్ లో ఎసెన్స్ కలిపిన ఈ కట్ చేసిన ముక్కల ఫై పోసి 
వాటిమీద ఫైనాపిల్ ముక్కలు పెట్టి వాటి ఫై చెర్రి ముక్కలు పెట్టి సర్వ్ చెయ్యాలి.