
కావలసిన పదార్ధాలు :
పంచదార : రెండు కప్పులు
నెయ్యి : కప్పు
జీడిపప్పు, బాదంపప్పు :పావు కప్పు
బొంబాయి రవ్వ : కప్పు
యాలకుల పొడి : కొద్దిగా
తయారుచేసే విధానం :
1) టమాటోలు ఉడికించి చిక్కటి గుజ్జు తీయాలి.
2) బాణలిలో నెయ్యి పోసి జీడిపప్పు, బాదంపప్పు వేయించాలి.
3) అదే బాణలిలో బొంబాయి రవ్వను వేసి దోరగా వేయించాలి.
4) వేరే గిన్నేలో రెండు కప్పుల నీరు పోసి మరిగించి, వేయించిన బొంబాయి రవ్వను కలపాలి.
5) ఇది ఉడికిన తరువాత టొమోటో గుజ్జు, పంచదార, జీడిపప్పు, బాదంపప్పు, నెయ్యి వేసి కలియబెట్టాలి.
6) ఇప్పుడు యాలకుల పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆపాలి.
7) దీనిని నెయ్యి రాసిన ప్లేట్ కి తీసుకోని చల్లారిన తరువాత మనకు కావలసిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే రుచికరమైన టొమోటో హల్వా రేడి.
300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te