మినప పునుకులు (minapa punukulu in telugu )

కావలసిన పదార్దాలు 

బియ్యం : అర కేజీ 
మినపప్పు : పావుకేజీ  
నూనె :  వేయించటానికి కి సరిపడా
ఉల్లిపాయలు : రెండు పచ్చిమిర్చి : నాలుగు 
అల్లం ముక్కలు : టేబుల్ స్పూన్ 
వంట సోడా : పావు టీ స్పూన్ 
జీలకర్ర : అరటీ స్పూన్  
ఉప్పు : తగినంత

తయారుచేయు విధానం 

1) మినప్పప్పు,బియ్యం శుభ్రంగా కడిగి ఐదు  గంటలు నానబెట్టాలి. తరువాత మెత్తగా పిండి రుబ్బుకోవాలి.
2) ఈ పిండిని ఐదు గంటలు పక్కన పెట్టాలి.ఇలా చేస్తే పిండి పులిసి పునుకులు బాగా వస్తాయి.
3) ఇప్పుడు ఈ  పిండిలో ఉల్లిపాయ ,పచ్చిమిర్చి,అల్లం ముక్కలు,జీలకర్ర,ఉప్పు,వంట సోడా కలపాలి.
4) ఈ పిండి  గట్టిగా కలుపుకోవాలి.చేతితో చిన్న ఉండలుగా చేసి కాగిన నూనెలో వేయించుకోవాలి.