దద్ధోజనం (daddojanam in telugu )

కావలసినపదార్దాలు :


తాజా గట్టి పెరుగు -రెండు కప్పులు
బియ్యం -రెండు కప్పులు,
నెయ్యి-రెండు చెంచాలు
మినప్పప్పు : టీ స్పూన్ 
సెనగపప్పు : టీ స్పూన్ 
ఆవాలు : టీ స్పూన్ 
జిలకర్ర : టీ స్పూన్ 
మెంతులు : రెండు టి స్పూన్లు 
ఎండు మిర్చి : రెండు 
కరివేపాకు  : రెండు రెబ్బలు
కొత్తిమీర : ఒక కట్ట
అల్లం : చిన్నముక్క
పచ్చిమిర్చి : రెండు 
ఉప్పు :  తగినంత. 


తయారు చేయు విధానం :

1) బియ్యం కడిగి నీళ్ళు పోసి అన్నం వండుకోవాలి.
2) వండిన అన్నం ఒక పళ్ళెంలోవేసి చల్లారనివ్వాలి.
3) ఇప్పుడు కళాయిలో నెయ్యి వేడి చేసి తాలింపు దినుసులు, మెంతులు, ఎండు మిర్చివేసి వేయించాలి.
 4) కరివేపాకు, పచ్చి మిర్చి ముక్కలు వేయాలి.
5) ఈ తాలింపు పెరుగులో కలపాలి.
6) పెరుగు లో తగినంత ఉప్పు, తరిగిన అల్లం, కొత్తిమీర కూడ వేసి అన్నం లో  వేసి కలపాలి.పెరుగు అన్నానికి పూర్తిగా కలిశాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి.