చికెన్ టిక్కాకావలసిన పదార్దాలు :
మెత్తటి చికెన్ : పావుకేజీ
ఓట్సు: రెండు టేబుల్ స్పూన్లు
బియ్యప్పిండి : రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు : తగినంత
కారం : ఒక టేబుల్ స్పూన్
కొత్తిమీర పుదినా పేస్టు : టేబుల్ స్పూన్
పచ్చి బటాణి పేస్టు : టేబుల్ స్పూన్
పెరుగు : రెండు టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్
తయారు చేయు విధానం:
౧)చికెన్ ని మిక్సి పట్టాలి. దీనిలో కారం, ఉప్పు,పెరుగు, అల్లం వెల్లులి పేస్టు, కొత్తిమీర పేస్టు ,ఓట్సు.బటాని పేస్టు కలపాలి.
౨) వీటిని చిన్నచిన్న ముద్దలుగా తీసుకోని అర చేతీలో చిన్నగా వత్తి బియ్యప్పిండిలో అద్ది నాన్ స్టిక్ పాన్ మీద కొద్దిగా నూనె వేసి రెండు ప్రక్కలా బాగా వేయించాలి.