గోంగూర కూర
కావలసిన పదార్దములు
గోంగూర -పెద్దవి రెండు కట్టలు
పోపుదినుసులు -టీ స్పూన్
ఎండిమిర్చి - మూడు
పచ్చిమిర్చి- ఐదు
ఉల్లిపాయలు - రెండు
ఉప్పు - సరిపడ
కారం -అర టీ స్పూన్
పసుపు - అర టీ స్పూన్
కరివేపాకు - రెండు రెబ్బలు
తయారుచేయు విధానం
౧) గొంగూరనుశుబ్రంగా కడిగి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచాలి.
౨) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చేయాలి.కాగాక పోపు దినుసులు,ఎండి మిర్చి,కరివేపాకు వేసి వేగాక
ఉల్లి ముక్కలు,పచ్చి మిర్చిముక్కలు వేసి వేగిన తరువాత పసుపు,కారం,ఉప్పు వేసి వెంటనే కట్ చేసిన గోంగూర
వేసి మూతపెట్టాలి.పది నిముషాలకు కూర రెడీ.
Post a Comment