ఉసిరి పాకం కావలసిన పదార్దాలు :
ఉసిరికాయలు : కేజీ
పంచదార : అర కేజీ
యాలుకపొడి : అర టీ స్పూన్
తయారుచేయు విధానం :
1) ఉసిరికాయలు ముక్కలుచేసి గింజలు తియ్యాలి.
2) స్టవ్ ఫై గిన్నేపెట్టి పంచదార, తగినన్ని నీళ్ళు పోసి పాకం పట్టాలి.
3) ముదురు పాకం వచ్చాక,ఉసిరి ముక్కలు వేసి బాగా కలపాలి.
4)ఇప్పుడు యలుకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆపాలి.
5) చల్లారిన తరువాత ఒక సీసాలో నిల్వచేసుకోవాలి.