ఉసిరి ఆవకాయ పచ్చడి కావలసిన పదార్దాలు :
ఉసిరికాయలు : కేజీ
కారం : పావుకేజీ
ఉప్పు : పావుకేజీ
ఆవపిండి : పావుకేజీ
వుడికించిన చింతపండు గుజ్జు :వంద గ్రాములు
పసుపు : టీ స్పూన్
నూనె :కేజీ
వెల్లుల్లి ముద్దా : వందగ్రాములు
తయారుచేయు విధానం :
1) ఉసిరి కాయలు కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టి పక్కన ఉంచాలి.
స్టవ్ ఫై కళాయి పెట్టి అర కేజీ నూనె పోసి కాగాక ఉసిరి కాయలు వేసి దోరగా వేపి ఒక గిన్నెలోకి తీసి చల్లార నివ్వాలి.
2) ఉసిరి కాయలు బాగా చల్లారిన తరువాత వీటిలో ఉప్పు, కారం, ఆవపిండి, పసుపు వేసి బాగా కలపాలి.
3) ఇప్పుడు చింతపండు గుజ్జు, వెల్లుల్లి ముద్ద,మిగిలిన నూనె వేసి కలిపి మూత పెట్టి మూడు రోజులు కదపకుండా ఉంచితే బాగా ఊరుతుంది.
4) మూడు రోజుల తరువాత మనం వాడుకోవచ్చు.