రొయ్యలు గోంగూర పచ్చడి (Prawns Gongura Pickle in telugu)


కావలసిన పదార్దాలు :

పచ్చిరొయ్యలు : కేజీ  

గోంగూర : పావు కేజీ 
కారం : కప్పుఉప్పు : తగినంత 
అల్లం వెల్లుల్లి పేస్టు : రెండు టేబుల్ స్పూన్లు 
పసుపు : టీ స్పూన్ 
నూనె : అర కేజీ 
ధనియాలపొడి : అర కప్పు  

తయారుచేయు విధానం :

1)గోంగూర ఆకులు కడిగి తడి లేకుండా ఆరబెట్టాలి (నీడలో)తడి ఉంటె పచ్చడి పాడవుతుంది. 
2) రొయ్యలు వలిచి శుబ్రంగా కడిగి నీళ్ళు లేకుండా ఒక గిన్నెలో వేయ్యాలి.
3) వీటిలో పసుపు, ఉప్పు, ఒక స్పూన్అల్లం వెల్లుల్లి వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి. 
4) రొయ్యల్లో నీళ్ళు మొత్తం యిగిరి పోయాక పొడిగా అయ్యాక దించి చల్లారనివ్వాలి. 
5) స్టవ్ ఫై కళాయి పెట్టి కొద్దిగా నూనె వేడిచేసి ఉడికించిన రొయ్యలు డిప్ ఫ్రైచెయ్యాలి.
6) స్టవ్ ఫై మరో కళాయి పెట్టి మిగలిన నూనెవేసి గోంగూర వేసివేయించాలి.
7) గోంగూర నూనెలో మగ్గిన తరువాత వేయించిన రొయ్యలు,కారం, ఉప్పు, ధనియాలపొడి, గరం మసాలా, మిగిలిన అల్లం పేస్టు వేసి బాగా కలపాలి.
8) ఐదు నిముషాలు కలుపుతూ ఉంటె రొయ్యలు గోంగూర కారం అన్ని బాగా కలిసి పచ్చడి రెడీ అయినట్టే.ఇప్పుడు స్టవ్ ఆపాలి .