టమాట హల్వా (Tomato Halwa Preparation in Telugu)

వంటపేరు : టమాట హల్వా 


కావలసినవి పదార్ధాలు : 

ఎర్రని టమాటాలు : ఆరు 
నెయ్యి : అరకప్పు 
పంచదార : కప్పు 
రవ్వ : అర కప్పు 
బాదం, జీడిపప్పులు : అర కప్పు 
యాలకులు పొడి : టీ స్పూన్  

తయారుచేయు విధానం :

1) ముందుగా టమాటాలు ఉ డకబెట్టి నీళ్ళు వంపి, మిక్సిలో గుజ్జుగా చేసి పక్కన పెట్టాలి.
2) స్టవ్ వెలిగించి నెయ్యి వేడిచేసి జీడిపప్పులు, బాదం పప్పులు దోరగా వేపి ప్లేట్లోకి తీసుకోవాలి.
3)ఇప్పుడు అదే నెయ్యి లో రవ్వ వేసి దోరగా వేపి, దానిలో రెండు కప్పుల నీళ్ళు పోసి వుడకనివ్వాలి.
4) రవ్వకాస్త గట్టిపడగానే టమాట గుజ్జు, పంచదార వేసి కలపాలి, బాగా చిక్కబడిన తరువాత యాలుకల పొడి, వేయించిన జీడిపప్పు, బాదం పప్పు, మిగిలిన నెయ్యి వేసి కలిపి ముద్దగా అయ్యిన తరువాత స్టవ్ ఆపాలి.
5) ప్లేటుకి నెయ్యిరాసి ఈ మిశ్రమం వేసి సమంగా చేసి ముక్కలు కట్ చేసుకోవాలి.
6) లేదా ఒక గాజు గిన్నెలోకి ఈ హల్వని తీసుకోని స్పూన్ తో తినవచ్చు.


* అంతే టమాట హల్వ రెడీ.