తీపి బూంది (Sweet Boondi in telugu Teepi Boondi)

వంటపేరు : తీపి బూంది


కావలసిన పదార్దములు :


సెనగ పిండి : పావుకేజీ
పంచదార : పావుకేజీ
యాలుకుల పొడి : అర టీ స్పూన్
అరేంజ్ కలర్ : చిటికెడు
వంట సోడా : చిటికెడు
నూనె : పావుకేజీ


తయారుచేయు విధానం :


1) సెనగపిండిలో సోడా కలిపి నీళ్ళు పోసి బజ్జీల  పిండిలా కలపాలి.
2) స్టవ్ వెలిగించి కళాయిపెట్టి నూనె వేడి చెయ్యాలి.
3) ఇప్పుడు చిల్లుల గరిటిలో పిండిని వేసి చేతితో కదుపుతూ కాగే నూనెలో బూందిలా వేసి నూనెలో పైకితేలగానే తీసి వెయ్యాలి. (మరీ వేగనివ్వగూడదు)
4) ఒక గిన్నెలో పంచదార, కొద్దిగా నీళ్ళు పోసి స్టవ్ మీద  పెట్టి పాకం పట్టాలి. లేత తీగపాకం రాగానే యాలుకలపొడి వేసి వెంటనే బూంది వేసి కలిపి కాసేపు వుంచి వేరే ప్లేటులోకి తీసుకోవాలి.


* అంతే తీపి బూంది రెడి.