పన్నీర్ ప్రైడ్ రైస్ (Panneer Fried Rice)

వంటపేరు : పన్నీర్ ప్రైడ్ రైస్


కావలసిన పధార్దములు :


బాస్మతి బియ్యం : కప్పు 
పనీర్ : వంద గ్రాములు 
ఉల్లిపాయలు : రెండు 
క్యాప్సికం : ఒకటి   
క్యేబేజీ తరుగు : కప్పు 
మిరియాలపొడి : టీ స్పూన్ 
నెయ్యి : రెండు టేబుల్ స్పూన్లు 
ఉప్పు : తగినంత 


తయారుచేయు విధానం :


1) బియ్యం కడిగి అరగంట నానబెట్టాలి.
2) బియ్యంలో ఉప్పు వేసి అన్నం వండి పక్కన పెట్టాలి.
3) వేరే గిన్నెలో నెయ్యి  వేడి చేసి  ఉల్లి ముక్కలు, క్యేప్సికం ముక్కలు, క్యాబేజీ తరుగు వేసి వేయించాలి.
4) తరువాత పనీర్ వేసి ఒక నిముషం  వేపి వండిన అన్నం వేసి కలపాలి.
5) ఇప్పుడు మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.


* అంతే పనీర్ ప్రైడ్ రైస్ రెడీ.