చికెన్ 65 (Chicken 65 preparation in Telugu)

వంటపేరు :చికెన్ 65


కావలసిన పదార్దములు 


చికెన్ : అర కిలో 
పెరుగు : మూడు టేబుల్ స్పూన్లు 
కారం : టీ స్పూన్ 
పసుపు : అర టీ స్పూన్ 
ఉప్పు : సరిపడా 
సోయాసాస్ : రెండు టీ స్పూన్లు   
చిల్లీసాస్ : రెండు టీ స్పూన్లు 
ధనియాలపొడి : రెండు టీ స్పూన్లు  
గరం మసాలా : టీ స్పూన్ 
అజినమోటో : కొద్దిగా  
కాన్ ఫ్లొర్ : టీ స్పూన్లు 
మైదా : రెండు టేబుల్ స్పూన్లు 
కోడిగుడ్డు : ఒకటి 
కొత్తిమీర : చిన్నకట్ట 
పచ్చిమిర్చి : నాలుగు  
వెల్లుల్లి రెబ్బలు : ఆరు 
నూనె : అరకిలో  
ఉల్లిపాయ : ఒకటి చక్రాలాకట్ చెయ్యాలి  


తయారు చేయు విధానం :


1) ముందుగాఒక గిన్నెలో చికెన్ వేసుకొని దానిలో ధనియాలపొడి, కారం, ఉప్పు, పసుపు, గరం మసాల, అజినమోటో, కాన్ ఫ్లోర్ , మైదా, ఒక స్పూన్ చిల్లిసాస్, ఒకస్పూన్ సోయాసాస్, గుడ్డుసొన వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి.
2) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. నూనె కాగిన తరువాత అన్ని కలిపిన చికెన్ ఒకొక్కటిగా వేసి ఫ్రె  చెయ్యాలి. అలా వేపిన చికెన్ ఒక ప్లేటులోకి తీసి పక్కన పెట్టాలి.
3) ఇప్పుడు మరో కళాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగిన తరువాత  పెరుగు వేసి ఒకసారి కలిపి, వేయించిన చికెన్ ముక్కలు, మిగిలిన చిల్లీసాస్, సోయాసాస్, ఉప్పు, కొత్తిమీర వేసి కలిపి పెరుగు యిగిరిపోయే వరకు కలుపుతూ వుంటే ఒక నిముషంలో రెడీ అవ్వుతుంది. ఇప్పుడు కొత్తిమీర జల్లి  స్టవ్ ఆపాలి.


* వీటిని ఒక ప్లేటులోకి తీసుకోని ఉల్లి చక్రాలతో అలంకరించి  సర్వ్ చేయడమే.


* అంతే  చికెన్ 65 రెడీ.