పానకం (Panakam)

వంటపేరు : పానకం


కావలసిన పదార్ధాలు : 


బెల్లం : రెండు కప్పులు
మంచి నీళ్ళు : ఆరు కప్పులు
మిరియాల పొడి : రెండు టీ స్పూన్లు
ఉప్పు : చిటికెడు
శొంటిపొడి : టీ స్పూన్
నిమ్మరసం : రెండు టీ స్పూన్లు
(కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు)
యాలుకల పొడి : టీ స్పూన్


తయారుచేయు విధానం :


1) బెల్లం మెత్తగా కొట్టి, నీళ్ళలో కలపాలి. 
2) బెల్లం మొత్తం కరిగాక, పలుచని క్లాత్ లో వడకట్టాలి.
    (టీ ఫిల్టర్ తో వడపోయ్యోచ్చు)
3) ఇప్పుడు దీనిలో మిరియాలపొడి, శొంటి పొడి, ఉప్పు, యాలుకల పొడి, 
    నిమ్మరసం వేసి బాగా కలపాలి.


* అంతే పానకం రెడి.