చింతకాయ పచ్చిచేపల కూర

వంటపేరు : చింతకాయ పచ్చిచేపల కూర


కావలసిన పదార్ధాలు :

చేపలు : అరకిలో
చింతకాయలు : పెద్దవి ఆరు
ధనియాల పొడి : రెండు టీ స్పూన్లు
కారం : మూడు టేబుల్ స్పూన్లు
అల్లం-వెల్లుల్లి ముద్ద : రెండు టీస్పూన్లు
ఉల్లి పాయలు : రెండు ముక్కలుగా కొయ్యాలి
పచ్చిమిర్చి : మూడు ముక్కలు చెయ్యాలి
పసుపు : 1 టీ స్పూన్
నూనె : 6 టేబుల్ స్పూన్లు
కరివేపాకు : కొద్దిగా
కొత్తిమిర : కొద్దిగా
జీలకర్ర : 1 టీ స్పూన్


తయారు చేయు విధానం :

1) చేపలు బాగా కడిగి ఉప్పు, కారం, పసుపు వేసి పక్కనపెట్టాలి.
2) చింతకాయలు కడిగి ఉడకబెట్టి, చల్లారిన తరువాత రసం తీసి ఉంచాలి.
3) ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండిలో నూనె వేసి ఉల్లి ముక్కలు, మిర్చి 
    ముక్కలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి.
4) వేగిన అల్లంవెల్లుల్లి, ధనియాలపొడి వేసి కలిపి, చేప ముక్కలు వేసి 
    నెమ్మదిగా కలిపి చింతకాయల రసం వేసి మూతపెట్టాలి.
5) పది నిముషాలు ఉడికిన తరువాత, స్టవ్ ఆపి కొత్తిమిర జల్లితే 
    గుమగుమలాడే చింతకాయ చేపల పులుసు రెడి.