కొబ్బరి పాయసం (Kobbari Payasam / Coconut Semiya)

కావలసిన పదార్ధాలు :

బియ్యం : పావుకిలో
పాలు : పావుకిలో
కొబ్బరి పాలు : పావుకిలో
బెల్లం : అరకిలో
నెయ్యి : 1 టేబుల్ స్పూన్ 
జీడిపప్పులు, బాదంపప్పులు, కిస్మిస్లు, కుంకుమపువ్వు : కొద్దిగా


తయారుచేయు విధానం :

1) స్టవ్ వెలిగించి, గిన్నెపెట్టి కొద్దిగా నీళ్ళు పోసి కాగిన తరువాత కడిగిన 
    బియ్యం వేసి ఒక పొంగు వచ్చాక పాలు కలిపి ఉడకనివ్వాలి.
2) పాలు దగ్గర పడ్డాక, సిద్దం చేసిన కొబ్బరి పాలు పోసి అరగంట 
    ఉడకనివ్వాలి. గరిటతో కలుపుతూ వుండాలి.
3) ఇప్పుడు బెల్లంకోరు వేసి కలపాలి పాయసం ఉడికి చిక్కపడుతుంది. 
4) ఇప్పుడు నేతిలో వేపిన జీడిపప్పులు, బాదంపప్పులు, కిస్మిస్లు వేసి 
    కలపాలి.
5) కొంచెం పాలల్లో కుంకుమపువ్వు వేసి కలిపి, పాయసంలో వేసి కలిపి 
    యాలుకలపొడి కూడా వేసి మూతపెట్టి స్టవ్ ఆపాలి.


* అంతే కొబ్బరి పాయసం రెడి.