కావలసిన పదార్దాలు.:
బీట్ రూట్ తురుము :కప్పు
బెల్లం : పావుకప్పు
పంచదార : పావు కప్పు
పాలు :అర కప్పు
జీడిపప్పు , పల్లీలు, బాదం, అన్ని కలిసి : అర కప్పు
కొబ్బరి పొడి : పావుకప్పు
రవ్వ : రెండు కప్పులు
పంచదారపొడి : కప్పు
యాలుకలుపొడి : టీ స్పూన్
కొద్దిగా నెయ్యిరవ్వ వేయించటానికి
తయారు చేయు విధానం :
పల్లీలు,జీడిపప్పు, బాదం వేపి పొడి చేసు కోవాలి.
1) స్టవ్ ఫై పాన్ పెట్టి దానిలో పాలు పోసి వేడి చెయ్యాలి అవి వేడి అయ్యాక బీట్ రైట్ తురుము వేసి కాసేపు ఉడికించాలి .
2) ఇప్పుడు పావుకప్పు పంచదార, బెల్లం, వేసి కలిపి పొడి చేసిన పల్లీలు, జిడి పప్పులు పొడి వేసి ఒక సారి కలిపి ఇప్పుడు కొబ్బరి పొడి వేసి ముద్దలా అవ్వగానే దించి చల్లార్చాలి.
3) దీనిని చిన్నచిన్న ఉండలుగా చేసి ఒక ప్లేటులోపెట్టి పక్కన పెట్టాలి.
4) ఇప్పుడు స్టవ్ ఫై కళాయి పెట్టి కొద్దిగా నేయ్యివేసి కాగాక రవ్వ వేసి దోరగా వేగ నివ్వాలి.
5) రవ్వ వేగాగానే ఒక ప్లేటులో వేసి దీనిలో పంచదార పొడి కలిపి దీనిలో కొద్దిగా పాలు వేసి తడి పొడిగా కలిపితే నెయ్యి రవ్వ కలిసి ఉండ చుట్టటానికి రవ్వ తయారుఅవ్వుతుంది.
6) ఇప్పుడు పాలు కలిపినరవ్వను కొద్దిగా చేతిలోకి తీసుకోని అరి చేతిలో కొంచెం వెడల్పు చేసి దీనిలో బీట్ రూట్ (మిశ్రమం ) ఉండను పెట్టి ఈ రవ్వతో చుట్టూ కప్పి ఉండాలా చుట్టాలి.
ఫైన రవ్వ ఉండ, లోపల బీట్ రూట్ ఉండ ఉంటుంది.
దీనిని మద్యకు రెండు ముక్కలుగా కట చేస్తే ఎంతో కలర్ ఫుల్ గా ఉండే బీట్ రూట్ రవ్వ లడ్డు రెడి.
Post a Comment