కావాల్సిన పదార్దాలు :బ్రెడ్ స్లైసెస్ : ఆరు
క్యాబేజి, క్యారెట్ తురుము : కప్పున్నర
ఉల్లికాడలు తరుగు : రెండు చెంచాలు
బంగాళదుంపలు : నాలుగు
ఉల్లిపాయలు : రెండు
పచ్చిమిర్చి : మూడు
సోయా సాస్ : స్పూన్
టమాట సాస్ : స్పూన్
వెల్లుల్లి రేకలు : ఏడు
నూనె :సరిపడా
ఉప్పు : తగినంత
తయారుచేయు విధానం :
తయారుచేయు విధానం :
1) బంగాళదుంపలు ఉడకబెట్టి, పొట్టు తీసి ముక్కలుగా కోసుకోవాలి.
2) తరువాత బాణలి పెట్టి కొంచెం నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు, బంగాళ దుంప ముక్కలు, క్యాబేజి తురుము, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి తురుము, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి.
3) ఇది బాగా దగ్గరగా కూరలా అయ్యాక దింపేసి ఉండలుగా చుట్టుకోవాలి.
4) ఇప్పుడు బ్రెడ్ స్లైసుల అంచులు తీసి నీళ్ళల్లో ముంచి వెంటనే తీసివేసి రెండు అరిచేతుల మద్య గట్టిగా పిండాలి. తరువాత ఒక్కో స్లైస్ పైన కూర ఉండను ఉంచి చుట్టూ మూసివేయాలి.
5) బాణలిలో నూనె వేసి వేడిచేసి బ్రెడ్ ఉండలని వేయించాలి.
6) తరువాత మందపాటి గిన్నెలో నాలుగు చెంచాల నూనె వేసి ఉల్లికాడలు, వెల్లుల్లి రేకలు, సోయా సాస్, టమోట సాస్, వేయించి పెట్టుకున్న బ్రెడ్ ఉండలు వేసి ఒక ఐదు నిమిషాలు ఉంచి దించేయాలి.
Post a Comment