మామిడితో సేమ్యా పులిహోరా(semyaa pulihora in telugu )


మామిడితో సేమ్యా పులిహోరా  

కావలసిన పదార్దాలు :

సేమ్యా : వంద గ్రాములు 
నూనె : మూడు టేబుల్ స్పూన్ లు 
పల్లీలు : టేబుల్ స్పూన్ 
కరివేపాకు  : రెండు రెమ్మలు 
పసుపు : చిటికెడు 
ఉప్పు :  తగినంత 
మామిడి తురుము   :టేబుల్  స్పూన్ 
ఆవాలు : పావుటీ స్పూన్  
పచ్చిమిర్చి : మూడు 
అల్లం  : చిన్న ముక్క 
నెయ్యి : టేబుల్ స్పూన్  

తయారుచేయు విధానం :

1) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నెయ్యి వేడిచేయ్యాలి.కాగాక సేమ్యా వేసి వేయించాలి.
2) స్టవ్ మీద నీళ్ళు మరిగించి వేయించిన సేమ్యా వేసి ఒక నిముషం వుంచి పసుపు కొద్దిగా నూనె వేసి ఉడికించి నీళ్ళు వంచి  పక్కన పెట్టాలి.ఇలా చేస్తే సేమ్యా పొడిపొడిగా ఉంటుంది.
3) స్టవ్  మీద  కళాయి పెట్టి నూనె వేడి చేసి ఆవాలు, పల్లీలు,కరివేపాకు వేసి వేయించాలి. వేగాక అల్లంముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, మామిడి తురుము వేసి వేయించాలి.
ఇప్పుడు  ఉడికించిన సేమ్యా వేసి కలపాలి.
అంతే మామిడి సేమ్యా రెడీ.