సేమియా కేసరి (Semiya Kesari in Telugu)

కావలిసిన పదార్దాలు :

శేమియా  : ఒక కప్పు

పాలు : ఒక కప్పు 
పంచదార : ఒక కప్పు
యాలకుల పొడి : స్పూన్
నెయ్యి : నాలుగు టేబుల్ స్పూన్లు 
జీడిపప్పు: పది 
కిస్మిస్ : పది 
బాదంపప్పు: పది 

తయారు చేసే విదానం :


1) స్టవ్ మీద బాణలి పెట్టి కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించాలి.
2) అదే నెయ్యిలో సేమియా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. 
3) నీళ్ళు, పాలు పోసి బాగా యిగిరి పోయేంత వరకు ఉడికించాలి.
 4) ఒక గిన్నె లో పంచదార వేసి కొద్దిగా  నీళ్ళు పోసి  ఉండ పాకం వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి .
5) ఉండ పాకం రాగానే మిగిలిన నెయ్యి వేసి సేమియా ఉన్న బాణలి లో పోసికలపాలి.
6) ఇప్పుడు నానబెట్టిన బాదం పప్పు పొడి చేసి కలపాలి. జీడిపప్పు ,కిస్మిస్ ,యాలకుల పొడి వేసుకుని సర్వ్ చేసుకోవాలి.