రాగి హల్వా (raagi halwa in telugu )

రాగి పిండి హల్వా :
కావలసినపదార్దాలు

రాగి పిండి: పావుకిలో
నెయ్యి : వందగ్రాములు
 పంచదార : పావుకిలో
 జీడిపప్పు : పది

 తయారు చేయు విధానం

1) రాగి పిండిలో తగినన్ని నీళ్ళు పోసి కలిపి పలచని వస్త్రం తో వడ కట్టాలి.
 2) అందులోని నల్లని పొట్టు అంతా పోతుంది.
3) వడకట్టిన నీళ్ళు అర గంట సేపు పక్కన ఉంచాలి.అప్పటికి నీళ్ళు పైకి తేరుకుంటాయి.ఆ నీళ్ళు వంపేయ్యాలి 
4) స్టవ్ ఫై గిన్నె పెట్టి పంచదార, కొద్దిగా నీళ్ళు పోసి లేత పాకం పట్టాలి.
5) ఇప్పుడు అడుగున తేరుకున్న రాగి పిండిని పాకంలో వేసి బాగా తిప్పాలి.
6) పాకం చిక్క పడుతుండగా నెయ్యి పోసి  ఉడికించాలి. హల్వా రెడీ అవ్వుతుంది.
7) ఈ హల్వాను నెయ్యి రాసిన ప్లేట్ లో వేసి ఆరినతర్వాత చాకుతో ముక్కలు కోయాలి.
 ఈ హల్వా మిద జీడిపప్పు అతికిస్తే సరి.
 రాగి హల్వా రెడీ .