పనస హల్వ(panasa halvva in telugu )

పనస హల్వ 
కావలసిన పదార్దాలు :

గోధుమరవ్వ : కప్పు 
పంచదార : కప్పు 
నెయ్యి :అర కప్పు 
పాలు : మూడు కప్పులు 
జిడిపప్పులు : పావుకప్పు 
బాదాం పప్పులు : పావుకప్పు 
యాలుకులు పొడి :పావు టీ స్పూన్ 
పనస తొనలు : కప్పు 

తయారుచేయు విధానం :

1) పనస తొనలు గింజలు తీసి ముక్కలుగా కట్ చేసి కొన్ని ముక్కలు పక్కన పెట్టి మిగిలిన ముక్కలు మిక్సి జార్లో వేసి మెత్తగా పేస్టు చేసుకోవాలి.
2) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నెయ్యి వేడి చెయ్యాలి. కాగిన నేతిలో జీడిపప్పులు, బాదం పప్పులు  వేసి వేయించాలి.
3) ఇప్పుడు ఇదే నేతిలో గోధుమ రవ్వ వేసి దోరగా వేయించాలి.రవ్వ వేగుతుండగాపక్కన పెట్టిన పనస తొనలు వేసి ఒక నిముషం వేపి పాలు పోసి కలుపుతుండాలి. ఇప్పుడు మెత్తగా మిక్సి పట్టిన పనసతొనల పేస్టు వేసి చిన్న మంటమీద కలుపుతూ ఉడక నివ్వాలి.
4) ఇది చిక్కగా అయ్యిన తరువాత పంచదార వేసి కలపాలి.మిగిలిన నెయ్యి, యాలుకులుపొడి,చిన్నగా ముక్కలు చేసిన జీడిపప్పు, బాదాం ముక్కలు వేసి ఒక నిముషం కలిపి స్టవ్ ఆపాలి. 
అంతే ఎంతో రుచిగా ఉండే పనస హల్వ రెడీ.