ఇడ్లి ఉప్మా (idli upmaa in telugu )


కావలసిన పదార్దాలు

ఇడ్లీలు: ఐదు
ఉల్లిపాయ : ఒకటి
పచ్చిమిర్చి : మూడు
పోపుదినుసులు : టీ స్పూన్
జీడిపప్పులు : పది
ఎండు మిర్చి  : రెండు
కరివేపాకు : రెండు రెమ్మలు
ఉప్పు : తగినంత
క్యారెట్ తురుము : రెండు టేబుల్ స్పూన్లు
పసుపు : చిటికెడు
కొత్తిమీర : చిన్నకట్ట
నిమ్మరసం : టేబుల్ స్పూన్
నూనె : రెండు టేబుల్  
తయారుచేయు విధానం :
౧) ఇడ్లీలు పొడి పోడిగా చేసి పక్కన పెట్టాలి.
౨) స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి కాగాక పోపుదినుసులు  వేసి వేగాక
ఎండుమిర్చి,  కరివేపాకు, జీడిపప్పులు,  పల్లిలు వేసి వేయించాలి.
౩) ఇప్పుడు ఉల్లుపాయ ముక్కలు,  పచ్చిమిర్చి ముక్కలు,  వేసి వేగాక ఉప్పు,  పసుపు,  క్యారెట్ తురుము,  వేసి కలిపి ఇడ్లి పొడి వేసి బాగా కలిపాలి. ఇప్పుడు  స్టవ్ ఆపాలి.
౪) ఇప్పుడు కొత్తిమీర, నిమ్మరసం వేసి కలిపి జీడిపప్పులతో సర్వ్ చెయ్యాలి.