దొండకాయల పకోడీ కావలసిన పదార్దాలు :
దొండకాయలు : పావుకేజీ
ఉల్లిపాయలు : రెండు
పచ్చిమిర్చి : మూడు
జీలకర్ర : అర టీ స్పూన్
ఉప్పు : తగినంత
కారం : అర టీ స్పూన్
కొత్తిమీర : కొద్దిగా
కరి వేపాకు : కొద్దిగా
కార్న్ ఫ్లోర్ : పావు కప్పు
శెనగపిండి : కప్పు
నూనె : వేయించటానికి సరిపడా
తయారుచేయు విధానం :
1) దొండకాయలు సన్నగా పొడవుగా కొయ్యాలి.ఉల్లి, మిర్చి కట్ చెయ్యాలి.
2) ఒక గిన్నెలో దొండ ముక్కలు, ఉల్లి, మిర్చి ముక్కలు, కారం, ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, కార్న్ ఫ్లోర్, శెనగపిండి వేసి కొద్దిగా నీళ్ళు పోసి పకోడి పిండిలా కలపాలి.
3) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి.నూనె కాగిన తరువాత పకోడి ల్లా వేసి దోరగా వేయించి ఒక ప్లేటులోకి తీసుకోవాలి.