మామిడి తురుము : కప్పు
బియ్యపురవ్వ : రెండు కప్పులు
ఆవాలు : టాబుల్ స్పూన్
మినపప్పు : టేబుల్ స్పూన్
శెనగపప్పు : టేబుల్ స్పూన్
కరివేపాకు : కొద్దిగా
ఎండుమిర్చి : మూడు
పచ్చిమిర్చి : మూడు
పసుపు : అర టీ స్పూన్
ఉప్పు : తగినంత
నూనె : అర కప్పు
పల్లీలు : రెండు టేబుల్ స్పూన్లు
జీడిపప్పులు : పది
తయారుచేయు విధానం:
1) ముందుగా బియ్యపు రవ్వను నాలుగు
గ్లాసుల నీళ్ళు, మూడు స్పున్ల్ నూనె, కొద్దిగా ఉప్పు వేసిఉడికించి ఒక పళ్ళెంలో వేసి పొడిపొడిగా
అయ్యేంత వరకు చల్లార నివ్వాలి.
2) స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి
చేసి దానిలో ఆవాలు, శెనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, ఎండుమిర్చి వేసి వేయించాలి.
3) వేగాక పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు,
జీడిపప్పు వేసి వేయించి ఇప్పుడు మామిడి తురుము వేసి రెండు నిముషాలు వేయించి స్టవ్ ఆపాలి.
4) దీనిలో ఉడికి చల్లారిన బియ్యపు రవ్వ
వేసి బాగా కలపాలి.
5) అంతే ఎంతో రుచిగా ఉండే మామిడి రవ్వ
పులిహోర రెడీ.
