పాలపొడి లడ్డు (Milk Powder Laddu in telugu Paalapodi Laddu)

కావలసిన పదార్దాలు :

పాలపొడి : కప్పు 

పాలు : అర కప్పు 
పంచదార : అర కప్పు 
జీడిపప్పులు ముక్కలు : అర కప్పు 
నెయ్యి : అరకప్పు 
కొబ్బరిపొడి : అర కప్పు 
పిస్తా పప్పులు : పది 

తయారుచేయు విధానం :


1) స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ పాన్ పెట్టి దానిలో అరకప్పు పాలు పోసి వేడి చెయ్యాలి.
2) కాగిన పాలల్లో పంచదార వేసి కరగనివ్వాలి. 
3) ఇప్పుడు నెయ్యి వెయ్యాలి. కలుపుతూ ఉంటె నెయ్యి, పంచదార, పాలు కలిసిపోతాయి .
4) ఇప్పుడు పాలపొడి కొద్దికొద్దిగా వేస్తూ కలుపుతుండాలి.
5) కాస్త గట్టిబడిన తరువాత కొబ్బరిపొడి వేసి కలపాలి. ఇప్పుడు ఇంకాస్త గట్టి పడుతుంది .
6) ఇప్పుడు చిన్నగా కట్ చేసిన జీడిపప్పు ముక్కలు వేసి కలిపి స్టవ్ ఆపాలి.
7) కొద్దిగా చల్లబడ్డాక గోరువెచ్చగా ఉండగానే చేతికి నెయ్యి రాసుకొని గట్టిపడ్డ మిశ్రమం తీసుకోని లడ్డులా చేసి ఫైన పిస్తా పప్పు గుచ్చాలి.
8) అలా మొత్తం లడ్డూలు చేసి సర్వ్ చెయ్యడమే. 
9) ఇవి మెత్తగా ఉంటాయి. కాస్త గట్టిగ కావాలనుకుంటే పది నిముషాలు ఫ్రిజ్ లో పెట్టి తీస్తే గట్టిగాఉంటాయి.

Milk Powder Sweet Laddoo in telugu as Palapodi laddu.