తమలపాకు బజ్జి (Tamalapaku Bajji Preparation in Telugu)

వంటపేరు : తమలపాకు బజ్జి 


కావలసిన పదార్ధాలు :


తమలపాకులు : పది  
సెనగపిండి : పావుకేజీ 
ఉప్పు : సరిపడా 
వాము : టీ స్పూన్ 
కారం : అర టీ స్పూన్ 
వంటసోడా : చిటికెడు 
నూనె : వేయించటానికి సరిపడా


తయారుచేయు విధానం :


1) తమలపాకులు నీటిలో శుబ్రంగా కడిగి తుడిచి పక్కన ఉంచాలి.
2) సెనగపిండిలో కారం, ఉప్పు, సోడా, వామ్ము, కొద్దిగా నీళ్ళు కలిపి చిక్కగా 
    బజ్జి పిండిలా కలపాలి.
3) ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడి చెయ్యాలి. నూనె కాగిన 
    తరువాత తమలపాకులు ఒకొక్కటిగా సెనగపిండిలో ముంచి కాగే నూనెలో 
    బజ్జిలా వేసి దోరగా రెండువైపులా వేగనిచ్చి పేపర్ పరచిన ప్లేటులోకి 
    తీసుకోవాలి.


* అంతే ఎంతోరుచిగా ఉండే తమలపాకుల బజ్జి రెడి.