వంటపేరు : ఎగ్ మటన్ కర్రి
కావలసిన పదార్ధాలు :
గుడ్లు : నాలుగు
ఉల్లిపాయలు : మూడు
పచ్చిమిర్చి : మూడు
అల్లం వెల్లుల్లి పేస్టూ : టేబుల్ స్పూన్
కారం : 1 టీ స్పూన్
ఉప్పు : సరిపడా
గరం మసాల : 1 టీ స్పూన్
పసుపు : అర టీ స్పూన్
నూనె : రెండు టీ స్పూన్లు
టమాటాలు : రెండు
కొత్తిమిర : చిన్న కట్ట
కరివేపాకు : రెండు రెమ్మలు
తయారుచేయు విధానం :
1) ముందుగా గుడ్లు పగుల గొట్టి ఒక గిన్నెలో వేసి బాగా గిలకొట్టాలి.
2) స్టవ్ వెలిగించి కుక్కర్లో కొద్దిగా నీళ్ళుపోసి, గుడ్లుసన ఉన్నగిన్నెను కుక్కర్లో
పెట్టి రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపాలి.
3) చల్లారాక మూతతీసి లోపల గిన్నేను తీసి ఉడికిన గుడ్లు సొనను
ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాలి.
4) ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు చిన్నచిన్న ముక్కలుగా కొయ్యాలి.
5) ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండిలో నూనె వేడి చేసి, ఉల్లి ముక్కలు,
పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి. అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి
పచ్చివాసన పోయేవరకు వేపాలి.
6) ఇప్పుడు కరివేపాకు, టమాటాలు వేసి ఒకసారి కలిపి మూతపెట్టాలి. రెండు
నిముషాలకు టమాటాలు మగ్గి మెత్తబడతాయి .
7) మూతతీసి కలిపి, ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలిపి, కట్ చేసిన ఎగ్
ముక్కలు వేసి, ఒకసారి కలిపి, కొద్దిగా నీళ్ళుపోసి మూతపెట్టాలి.
8) ఐదు నిముషాలకు కూరరెడి అవుతుంది. ఇప్పుడు గరంమసాల వేసి
ఒకసారి కలిపి, కొత్తిమిర వేసి మూతపెట్టి స్టవ్ ఆపాలి.
* అంతే ఎగ్ మటన్ కర్రి రెడి.

Post a Comment