ఆకుకూరలతో పెరుగు పచ్చడి (Perugu Pachadi in Telugu )



కావలసిన పదార్దాలు 

తోటకూర చిన్నగా కట్ చేసినది  : ముప్పయి గ్రాములు 

చుక్కకూర చిన్నగా కట్చేసినది  : ముప్పయి గ్రాములు 
కొత్తిమీర : కట్ట చిన్నగా కట్ చెయ్యాలి 
కొబ్బరి తురుము : ఇరవై గ్రాములు 
సొరకాయ తురుము : పది గ్రాములు 
అల్లం తురుము : అర స్పూన్ 
టమాట : ఒకటి ముక్కలుగా కట్చెయ్యాలి.
ఉప్పు : తగినంత 
పచ్చిమిర్చి పేస్టూ : స్పూన్ 
పెరుగు : రెండు కప్పులు 
పసుపు పావు టీ స్పూన్ 
నిమ్మరసం : టేబుల్ స్పూన్ 

తయారుచేయు  విధానం: 

1) ఒక గిన్నెలో తోటకూర, చుక్కకూర, కొత్తిమీర, కేబేజీ తురుము, కొబ్బరి కోరు, 

2) సొరకాయ తురుము, టమాటాముక్కలు, ఉప్పు,  పచ్చిమిర్చిపేస్టు,  పెరుగు, అల్లం తురుము, 

3) నిమ్మరసం, పసుపు  వేసి బాగా కలిసేటట్టు కలిపితే పెరుగు పచ్చడి రెడి.

ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది.